Bootcut balraju: ‘బూట్‌కట్‌ బాలరాజు’ ప్రారంభం

సోహెల్‌, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

Updated : 09 Dec 2021 09:20 IST

సోహెల్‌, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్‌నిచ్చారు. మిర్యాల రవీందర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు శ్రీ కోనేటి నా మిత్రుడు. సోహెల్‌కి తగ్గ కథ కుదిరింది. ‘హుషారు’ తర్వాత ఆ తరహాలో మరో మంచి కథతో మేం ఈ సినిమాని రూపొందిస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చిత్రీకరణ పూర్తి చేస్తామ’’న్నారు. సోహెల్‌ మాట్లాడుతూ ‘‘బిగ్‌బాస్‌ నుంచి బయటికొచ్చాక నేను చేస్తున్న రెండో చిత్రమిది. బూట్‌కట్‌ బాలరాజ్‌ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోతుంద’’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని