Samantha: సమంత వ్యూహం ఫలించిందా?

ఒకపక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరో పక్క హిందీలో అవకాశాలపై దృష్టిపెట్టింది సమంత. ముంబయితో నిత్యం టచ్‌లో ఉంటూ పక్కా వ్యూహాలు రచిస్తోంది.

Updated : 24 Jun 2022 08:19 IST

ఒకపక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరో పక్క హిందీలో అవకాశాలపై దృష్టిపెట్టింది సమంత. ముంబయితో నిత్యం టచ్‌లో ఉంటూ పక్కా వ్యూహాలు రచిస్తోంది. అవి ఫలించినట్టే కనిపిస్తున్నాయి. సల్మాన్‌ఖాన్‌తో కలిసి సమంత నటించబోతోందనేది బాలీవుడ్‌ వర్గాల మాట. తాను కథానాయకుడిగా నటించిన ఓ సినిమాకి సీక్వెల్‌ చేస్తున్నారు సల్మాన్‌. అందులో దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకులకు చేరువైన కథానాయిక అయితేనే బాగుంటుందని భావించారని తెలిసింది. సమంతకే ఆ అవకాశం దక్కిందని ప్రచారం సాగుతోంది. సమంత తెలుగులో విజయ్‌ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది. ఆమె నటిస్తున్న కథానాయిక ప్రాధాన్య చిత్రాలు ‘యశోద’, ‘శాకుంతలం’ కూడా విడుదలకి ముస్తాబవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని