‘వనంగాన్‌’ నుంచి వైదొలిగిన సూర్య

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య, ప్రముఖ దర్శకుడు బాలా కలయికలో ‘వనంగాన్‌’ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Published : 06 Dec 2022 01:08 IST

మిళ అగ్ర కథానాయకుడు సూర్య, ప్రముఖ దర్శకుడు బాలా కలయికలో ‘వనంగాన్‌’ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి సూర్య వైదొలిగారు. ఈ విషయాన్ని బాలా సోమవారం తెలియజేశారు. ‘నేను ‘వనంగాన్‌’ అనే కొత్త సినిమాకి దర్శకత్వం వహించాలనుకున్నాను. ఇందులో నా సహోదరుడు సూర్య నటించడానికి ఒప్పుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఈ కథలో కొద్ది మార్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కథ సూర్యకి సరిపోదేమోనని నాకు సందేహంగా ఉంది. ఆయనకు నామీద, కథ మీద పూర్తి నమ్మకం ఉంది. అయినా మార్పులు చేసినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయనంటే నాకు చాలా ప్రేమ, గౌరవం, నమ్మకం.. దాన్ని నేను కాపాడుకోవాలి’ అంటూ ఒక ప్రకటనలో తెలిపారు. ‘దీనిపై ఇద్దరం చర్చించాం. ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నానని ఆయన చెప్పారు. భవిష్యత్తులో మా ఇద్దరి కలయికలో మరో సినిమా వచ్చే అవకాశం ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని