ఇప్పుడు ర్యాంప్‌ షోకి సిద్ధం

కొద్దిరోజుల కిందట షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నానంటూ సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.

Published : 21 Mar 2023 02:31 IST

కొద్దిరోజుల కిందట షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నానంటూ సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ర్యాంప్‌ షో చేస్తున్న పాత ఫొటోని ఇన్‌స్టాలో పంచుకుంటూ.. మళ్లీ ఫ్యాషన్‌ షో పాల్గొనడానికి సిద్ధమయ్యానన్నారు. ఈ సందర్భంగా ‘నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాను. పక్కటెముక విరిగినట్టు వైద్యులు చెప్పారు. కండరాలు పట్టేయడంతో భరించలేనంత నొప్పిగా ఉంది’ అంటూ మార్చి 5న తన బ్లాగులో రాసుకొచ్చారు బిగ్‌ బీ. ప్రభాస్‌, దీపిక పదుకొణెలు నాయకానాయికలుగా నాగ్‌అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’లో అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని