భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!

మూడేళ్లుగా తన పురోగతికి భయమే కారణమంటోంది నటి సమంత. రోజూ బోలెడంత భయం మధ్య జీవిస్తుంటానని చెబుతున్న ఆమె.. దాన్ని అధిగమించడానికి మార్గాలు అన్వేషిస్తుంటానని తెలిపింది.

Updated : 26 Mar 2023 03:48 IST


మూడేళ్లుగా తన పురోగతికి భయమే కారణమంటోంది నటి సమంత. రోజూ బోలెడంత భయం మధ్య జీవిస్తుంటానని చెబుతున్న ఆమె.. దాన్ని అధిగమించడానికి మార్గాలు అన్వేషిస్తుంటానని తెలిపింది. ఈ ప్రయాణంలోనే వ్యక్తిగా, నటిగా తనని తాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోగలుగుతున్నాని చెబుతోంది. ప్రస్తుతం ఆమె ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమ కావ్యమిది. ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. ఈ పౌరాణిక ప్రేమ కథా చిత్రం కోసం తనని సంప్రదించినప్పుడు తొలుత చేయనని చెప్పిందట సమంత. ఆ పాత్రకు తాను సరిపోతానో.. లేదో అన్న భయమే దానికి కారణమంది. ‘‘గుణశేఖర్‌ నాకు శాకుంతలం కథ చెప్పినప్పుడు నేను చేయనని చెప్పేశా. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నేను శకుంతలలా ఉండను. నాలో ఆ తేజస్సు, ఠీవీ కనిపించవు కదా అనిపించింది. అందుకే కథ వినగానే తొలుత చేయనని చెప్పేశా. అయితే ఈ మధ్య కాలంలో నేనిలా ఏ పాత్ర విషయంలోనైనా భయపడ్డానంటే కచ్చితంగా ఆ పాత్ర నేను చేయాల్సిందేనని నిర్ణయించేసుకుంటున్నా. నేనెందుకు చేయలేను అనుకుంటూ నాలోని ఆ భయాన్ని దాటేందుకు ప్రయత్నిస్తున్నా. ఇదే పద్ధతిని వ్యక్తిగత జీవితంలోనూ అనుసరిస్తున్నా. వ్యక్తిగా, నటిగా మూడేళ్లుగా నా పురోభివృద్ధికి కారణం ఈ భయమే’’ అని వివరించింది సామ్‌. ఆమె ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో కలిసి ‘ఖుషి’లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని