మానవుడి ప్రేమ కోసం మత్స్యకన్య పోరాటం

మానవ యువరాజు ప్రేమ కోసం సముద్రంలో జీవితాన్ని సాగిస్తున్న అందాల మత్య్సకన్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతనిని కలవడానికి చేసిన సాహసాల కథే ‘ది లిటిల్‌ మెర్మేడ్‌’.

Published : 25 May 2023 00:35 IST

మానవ యువరాజు ప్రేమ కోసం సముద్రంలో జీవితాన్ని సాగిస్తున్న అందాల మత్య్సకన్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతనిని కలవడానికి చేసిన సాహసాల కథే ‘ది లిటిల్‌ మెర్మేడ్‌’. మొదట 1837లో డానిష్‌ రచయిత క్రిస్టియన్‌ అండర్‌సన్‌ ఒక అద్భుతమైన కథను రాసుకున్నారు. అది 1989లో అది యానిమేటెడ్‌ చిత్రంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ కథ ఆధారంగా లైవ్‌ యాక్షన్‌ సాంకేతికతతో రూపొందిన ది లిటిల్‌ మెర్మేడ్‌ 26న రానుంది.


కథాంశం

కింగ్‌ ట్రిటన్‌ చిన్న కుమార్తె అందమైన, చురుకైన ఏరియల్‌ అనే పేరుగల మత్య్సకన్య కథ ఇది. ఏరియల్‌ సముద్రంలో పడిపోయిన ఎరిక్‌ అనే యువరాజును కాపాడుతుంది. ఆ యువరాజుతో ప్రేమలో పడుతుంది. ఎలాగైనా ఆ రాజుని కలుసుకోని, తనతో జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంటుంది. ఆ క్రమంలో సముద్రపు మంత్రగత్తే ఉర్సూల్లాని కలిసి మానవుడైన ఎరిక్‌ని కలుసుకోవాలని చేసిన ప్రయత్నాలు, సాహసాలు ఇందులో చూపించారు. ఏరియల్‌ ఎరిక్‌ని కలిసి తన ప్రేమ విషయాన్ని చెపుతుందా? ఎరిక్‌ అంగీకరిస్తాడా అనేది ఆసక్తికరం.


తారాగణం

ఈ చిత్రంలోని యువరాణి మత్య్సకన్యగా హాలీ బెయిలీ నటించింది. తనదైన నటనతో బెయిలీ మంచి పాపులారీటిని సొంతం చేసుకుంది. ఆమె సోదరి చోలే బెయిలేతో కలిసి ప్రముఖ గాయని, నటి చోలే ఎక్స్‌ హాలే సగభాగం నటించి తన నటనను నిరూపించుకుంది. 2019 జులైలో ఈ చిత్రంలోని పాత్రల ప్రకటన విడుదలైంది. అయితే అది జాతి ఆగ్రహానికి దారితీసింది. ఎ డాగ్‌ వే హోం చిత్రంతో సుపరిచితుడైన బ్రిటిష్‌ నటుడు జోనహ్‌ హౌరే యువరాజు పాత్రలో కనిపించాడు. యువరాణి ఏరియల్‌ గాత్రాన్ని దొంగిలించే సముద్రపు మంత్రగత్తె ఉర్సూల్ల పాత్రలో మెలిస్సా నటించింది. ఏరియల్‌ తండ్రి, రాజు ట్రిటన్‌ పాత్రను జావీర్‌ బార్డ్‌మ్‌ పోషించాడు.అందాల యువరాణి ఏరియల్‌తో ఉండే జంతువులకు కూడా ప్రముఖులు గాత్రదానం చేశారు. రూమ్‌, లూకా నటుడు జాకోబ్‌ ట్రెంబ్లే ఫ్లౌండర్‌కు స్వరాన్ని అందించగా, ఏరియల్‌తో స్నేహం చేసే పక్షి స్కటిల్‌కు ది ఫేర్‌వెల్‌ స్టార్‌, హాస్యనటుడు ఆవ్కవఫీనా గొంతునందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని