రాఘవుడు ఎక్కడుంటే.. అదే నా రాజ మందిరం

‘‘నువ్వు రాజకుమారివి జానకి. నువ్వు ఉండాల్సింది రాజ భవనంలో’’ అని తనతో వనవాసానికేగుతున్న జానకిని రఘు రాముడు వారించే ప్రయత్నం చేస్తుంటే.. ‘‘నా రాఘవ ఎక్కడుంటే.. అదే నా రాజ మందిరం.

Published : 30 May 2023 05:34 IST

‘‘నువ్వు రాజకుమారివి జానకి. నువ్వు ఉండాల్సింది రాజ భవనంలో’’ అని తనతో వనవాసానికేగుతున్న జానకిని రఘు రాముడు వారించే ప్రయత్నం చేస్తుంటే.. ‘‘నా రాఘవ ఎక్కడుంటే.. అదే నా రాజ మందిరం. మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళ్తుందేమో.. మీ జానకి వెళ్లదు’’ అని పతి భక్తిని చాటుకుంటోంది సీతమ్మ. మరి ఈ సీతారాముల కథ ఎలా సాగిందో తెలియాలంటే ‘ఆదిపురుష్‌’ చూడాల్సిందే. రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రమిది. రాఘవుడిగా ప్రభాస్‌ నటించగా.. జానకి పాత్రను కృతి సనన్‌ పోషించింది. లంకేశుడి పాత్రలో సైఫ్‌ అలీ ఖాన్‌ కనిపించనున్నారు. ఈ సినిమా జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా సోమవారం ‘ద సోల్‌ ఆఫ్‌ ఆదిపురుష్‌’ పేరుతో ‘‘రామ్‌ సీతా రామ్‌.. సీతా రామ్‌ జయ జయ రామ్‌’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటలో జానకికి దూరమై రాఘవుడు పడుతున్న వేదనను.. లంకలో జానకి పడుతున్న వ్యథను.. ఆమె జాడ తెలుసుకునే క్రమంలో హనుమ చేసిన సాయాన్ని.. మనసుకు హత్తుకునేలా చూపించారు. ఈ పాటకు సచేత్‌ - పరంపర స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. కార్తీక్‌, సచేత్‌ టాండన్‌, పరంపర టాండన్‌ సంయుక్తంగా ఆలపించారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని