teja sajja: సూపర్‌ యోధ.. తేజ సజ్జా

‘హను- మాన్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తేజ సజ్జా. ఇప్పుడు దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేనితో కలిసి కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

Updated : 16 Apr 2024 09:27 IST

ను- మాన్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తేజ సజ్జా. ఇప్పుడు దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేనితో కలిసి కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. వీళ్లిద్దరి కలయికలో రూపొందనున్న ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ప్రీలుక్‌ను విడుదల చేశారు. అందులో తేజ స్టైలిష్‌ లుక్‌లో సూపర్‌ యోధాగా కనిపించారు. ఈ చిత్ర టైటిల్‌ను ఈ నెల 18న ప్రకటించనున్నారు. ఇందులో తేజకు జోడీగా రితికా నాయక్‌ నటించనుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని