Market Mahalakshmi: వాస్తవ జీవిత కథే ఆధారం

‘‘ప్రేమకథతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’. ఇందులో మేము ఒక కొత్త అంశాన్ని స్పృశించాం. అది తప్పకుండా ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు దర్శకుడు వీఎస్‌ ముఖేష్‌.

Updated : 17 Apr 2024 12:13 IST

‘‘ప్రేమకథతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’. ఇందులో మేము ఒక కొత్త అంశాన్ని స్పృశించాం. అది తప్పకుండా ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు దర్శకుడు వీఎస్‌ ముఖేష్‌. ఆయన దర్శకత్వంలో పార్వతీశం, ప్రణీకాన్విక జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె.అఖిలేష్‌ నిర్మించారు. ఇది ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు ముఖేష్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ‘‘వాస్తవ జీవితంలో నాకు తెలిసిన ఒక మిత్రుడు కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. దాన్ని ఆధారం చేసుకునే నేనీ కథను సిద్ధం చేశా. దీన్ని మేమెంతో నిజాయతీగా.. వాస్తవికతకు దగ్గరగా రూపొందించాం. తెరపై సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతి దొరుకుతుంది. ఈ చిత్రంలో ఒక ఫైట్‌తో పాటు ఆరు పాటలున్నాయి. ఈ చిత్రాన్ని మేము 24రోజుల్లోనే పూర్తి చేశాం. ఈ సినిమా ఆరంభం నుంచే అసలు కథ మొదలైపోతుంది. అందుకే దీంట్లో ఎక్కడా సాగతీతగా అనిపించదు. టీజర్‌, ట్రైలర్లలో చూపించని ఓ కొత్త పాయింట్‌ సినిమాలో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. పార్వతీశం, ప్రణీకాన్విక కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. పార్వతీశంకు ఇది మంచి కమ్‌బ్యాక్‌ చిత్రమవుతుందని భావిస్తున్నా’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని