Keerthy Suresh: బేబి కీర్తి.. సెట్లో సందడి

ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్‌. ‘బేబి జాన్‌’తో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే.

Updated : 20 Apr 2024 12:15 IST

ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్‌. ‘బేబి జాన్‌’తో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. వరుణ్‌ ధావన్‌ హీరోగా కాలీస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఈ సినిమా షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తోంది చిత్రబృందం. కొత్త షెడ్యూల్‌లో భాగంగా షూటింగ్‌లో కీర్తి పాల్గొంది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ..వీడియోని పంచుకుంది. ‘‘బేబి జాన్‌’ సెట్స్‌లో బేబి కీర్తి’ అంటూ రాసుకొచ్చింది. బేబి కీర్తి అనే పేరున్న దుస్తులు ధరించి, ఎంతో ఉత్సాహంగా సందడి చేస్తున్న కీర్తి...ఈ చిత్రం పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మే 31న విడుదల కానున్న ఈ సినిమా..ఇంకాస్త ఆలస్యంగా  రాబోతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని