Shah Rukh Khan: గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?

సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు.

Updated : 20 Apr 2024 12:12 IST

సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. త్వరలో ‘కింగ్‌’ అనే సినిమాతో షారుక్‌ తన కుమార్తె సుహానాని వెండితెరకు పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. సుజోయ్‌ ఘోష్‌ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో షారుక్‌ అతిథి పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడీ సినిమాలో సుహానాకు మార్గనిర్దేశం చేసే గురువుగా ఆయన కనిపించనున్నట్లు తెలుస్తుంది. ‘‘సుహానా తొలి థియేట్రికల్‌ చిత్రమిది. కాబట్టి దీన్ని భారీ బడ్జెట్‌తో మునుపెన్నడూ చూడని యాక్షన్‌ చిత్రంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేశారు. షారుక్‌ పాత్రకు సరిసమానంగా సుహానా పాత్ర ఉంటుంది. ఇందులో వీరిద్దరు గురుశిష్యులుగా కనిపించబోతున్నారు. ప్రతి సన్నివేశం ప్రత్యేకంగా ఉండడం కోసం విదేశీ స్టంట్‌ మాస్టర్స్‌ ఆధ్వర్యంలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆగస్టులో షూటింగ్‌ ప్రారంభించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని