దుల్కర్‌ను కలిసిన రాఖీభాయ్‌

సావిత్రమ్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంతో జెమినీ గణేషన్‌గా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు నటుడు దుల్కర్‌ సల్మాన్‌. తాజాగా ఆయన కేజీఎఫ్‌ స్టార్‌ రాఖీ భాయ్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు..

Published : 05 Feb 2020 22:36 IST

 

తిరువనంతపురం: సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేషన్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు దుల్కర్‌ సల్మాన్‌. తాజాగా ఆయన కేజీఎఫ్‌ స్టార్‌ రాఖీ భాయ్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దుల్కర్‌-యశ్‌ అనుకోకుండా బుధవారం ఓ జిమ్‌లో కలిశారు. ఇందులో భాగంగా వీరిద్దరూ సినిమాల గురించి సరదాగా ముచ్చటించారు. అనంతరం యశ్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన దుల్కర్‌.. ‘యశ్‌ చాలా మంచి వ్యక్తి. నిన్ను కలవడం సంతోషంగా ఉంది బ్రదర్‌. నీ స్నేహం, ప్రేమాభిమానం, మాటలు నా హృదయాన్ని తాకాయి. త్వరలోనే నిన్ను మరోసారి కలవాలనుకుంటున్నాను. ‘కేజీఎఫ్‌2’.. రాకీ కోసం ఎదురుచూస్తున్నాను.’ అని దుల్కర్‌ పేర్కొన్నారు.

దుల్కర్‌ షేర్‌ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు లైకులతో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం యశ్‌.. ‘కేజీఎఫ్‌2’ సినిమాలో నటిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా షూటింగ్‌ ఇటీవల బెంగళూరులోని గ్లోబుల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో జరిగింది. మరోవైపు దుల్కర్‌ ‘కురూప్‌’ సినిమాలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts