ఎయిర్‌పోర్ట్‌లో బన్నీ.. ఇది గమనించారా..!

ఇటీవల విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. తాజాగా ఆయన టాలీవుడ్‌ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇంతకీ ఆ మాట ఏమిటంటే... ‘రౌడీ’ అనే బ్రాండ్‌ పేరుతో విజయ్‌దేవరకొండ ఫ్యాషన్‌ రంగంలోకి...

Published : 08 Feb 2020 14:40 IST

హీరోకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టైలిష్‌స్టార్‌

హైదరాబాద్‌: ఇటీవల విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. తాజాగా ఆయన టాలీవుడ్‌ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇంతకీ ఆ మాట ఏమిటంటే... ‘రౌడీ’ అనే బ్రాండ్‌ పేరుతో విజయ్‌దేవరకొండ ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఒకానొక సందర్భంలో విజయ్‌ దేవరకొండ దుస్తులు చూసి ‘నీ ‘రౌడీ’ వేర్‌ బాగుంది. మరి నాకెప్పుడు పంపిస్తున్నావ్‌’ అని బన్నీ సరదాగా  అడిగారట. దీంతో విజయ్‌.. ‘నేనే స్పెషల్‌గా డిజైన్‌ చేసి మీకోసం పంపిస్తాను అన్నా’ అని చెప్పారట. ఈ మేరకు ‘అల..వైకుంఠపురములో’ విడుదల రోజు విజయ్‌.. బన్నీ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసి రెండు ‘రౌడీ’ టీషర్ట్స్‌ పంపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన బన్నీ.. ‘థ్యాంక్యూ విజయ్‌. మాటిచ్చినట్లుగానే నాకోసం నువ్వే ప్రత్యేకంగా దుస్తులు డిజైన్‌ చేసి పంపించినందుకు ధన్యవాదాలు‌. తప్పకుండా వీటిని ధరిస్తాను.’ అని ఆ సమయంలో మాట ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా బన్నీ తన కుటుంబసభ్యులు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతికి వెళ్లే సమయంలో ఆయన విజయ్ దేవరకొండ ఇచ్చిన పసుపు, నలుపు రంగులో ఉన్న టీ షర్ట్‌ను ధరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ‘విజయ్‌కి ఇచ్చిన మాటను బన్నీ నిలబెట్టుకున్నారు.’, ‘రౌడీ వేర్‌లో బన్నీ’ అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని