కరోనా.. ఇంట్లోనే వర్కౌట్లు చేయండిలా..!

రోజురోజూకీ కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న కారణంగా ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నో విషయం తెలిసిందే. కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే థియేటర్లు, పార్కులు, విద్యాసంస్థలు కొన్ని రోజులపాటు మూసి వేశారు. అంతేకాకుండా కరోనా కట్టడిలో...

Published : 19 Mar 2020 21:12 IST

వీడియో షేర్‌ చేసిన నటుడు

హైదరాబాద్‌: రోజురోజూకీ కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న కారణంగా ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నో విషయం తెలిసిందే. కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే థియేటర్లు, పార్కులు, విద్యాసంస్థలు కొన్ని రోజులపాటు మూసి వేశారు. అంతేకాకుండా కరోనా కట్టడిలో భాగంగా పలుచోట్ల జిమ్‌లను కూడా క్లోజ్‌ చేశారు. దీంతో నటుడు సుధీర్‌ బాబు ఇంట్లో ఉండే సామాగ్రితో డెయిలీ వర్కౌట్లు ఎలా చేయవచ్చో తెలియచేస్తూ ప్రత్యేక వీడియోను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. వాటల్‌బాటిల్‌, బాల్‌తోపాటు సోఫాలను ఉపయోగించి పుషప్స్‌ చేయడం ఆయన చూపించారు.

సుధీర్‌-నాని కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా విడుదల చేయాల్సి ఉండగా కరోనా వైరస్‌ కారణంగా ‘వి’ సినిమా విడుదలను కొంతకాలంపాటు వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు