అప్పుడు 108సార్లు చాలీసా చదివేవాడిని: పవన్‌

తాను టీనేజ్‌లో ఉండగా హనుమాన్‌ చాలీసా 108 సార్లు చదివేవాడినని అంటున్నారు అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్‌

Published : 09 Apr 2020 18:11 IST

హైదరాబాద్‌: తాను టీనేజ్‌లో ఉండగా హనుమాన్‌ చాలీసా 108 సార్లు చదివేవాడినని అంటున్నారు అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఏప్రిల్‌ 8వ తేదీ తనకెంతో ప్రత్యేకమంటూ చిరంజీవి 1962లో తనకు లాటరీలో వచ్చిన ఆంజనేయస్వామి బొమ్మను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. దానిని ఇప్పటికీ తన వద్దే భద్రంగా దాచుకున్నట్లు చెప్పారు. చిరు చేసిన ఈ ట్వీట్‌కు పవన్‌ కూడా స్పందించారు.

‘‘హనుమంతుడిని ఆరాధించడం మా సోదరుడు చిరంజీవిగారితో మా ఇంట్లో అలవాటైంది. అదే మా తండ్రిని నాస్తికవాదం నుంచి రామ భక్తుడిగా మార్చింది. నేను టీనేజ్‌లో ఉండగా 108 సార్లు చాలీసా పారాయణం చేసేవాడిని. జై హనుమాన్‌’’ అని పవన్‌ ట్విటర్‌ వేదికగా చెప్పుకొచ్చారు.

గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌ మళ్లీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘పింక్‌’ రీమేక్‌ ‘వకీల్‌సాబ్‌’లో ఆయన నటిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దీనితో పాటు క్రిష్‌ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ నటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని