ఇలా చేయడానికి మనసెలా వచ్చింది: ఖుష్బూ

ఆడపిల్ల పుట్టుక భారంగా భావించే తల్లిదండ్రులు సమాజంలో ఇంకా ఉన్నారు. పేగు బంధాన్ని మరచి పురిటిలోనే శిశువును వదిలించుకోవాలని చెత్తకుప్పలో విసిరి వెళ్తున్న ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హరిణాయాలోని పాటిల్‌ నర్సింగ్‌ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది....

Updated : 01 Jun 2020 12:21 IST

నా హృదయం ద్రవించింది

చెన్నై: ఆడపిల్ల పుట్టుక భారంగా భావించే తల్లిదండ్రులు సమాజంలో ఇంకా ఉన్నారు. పేగు బంధాన్ని మరచి పురిటిలోనే శిశువును వదిలించుకోవాలని చెత్తకుప్పలో విసిరి వెళ్తున్న ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హరిణాయాలోని పాటిల్‌ నర్సింగ్‌ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. 400 గ్రాముల బరువున్న ఆడ శిశువును తల్లిదండ్రులు ఆసుపత్రిలోని చెత్తకుప్పలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. పోలీసులు ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్న దృశ్యాలు కూడా బయటికి వచ్చాయి. వీటిని చూసిన నటి ఖుష్భూ హృదయం చలించింది. పసిపాప ఉన్న పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇలా చేయడానికి మనసెలా వచ్చింది. ఇలాంటి ఘోరమైన ఘటనల్ని చూసినప్పుడే.. వీరంతా నిజంగా మనుషుల కడుపులో పుట్టారా? అని ఆశ్చర్యమేస్తుంది. శునకాలతో సహా అన్నీ జంతువులు తమ సంతానాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ ఘటన నిజం కాదని ఎవరైనా చెప్పండి (బాధతో). నా హృదయం ద్రవిస్తోంది. ఆసుపత్రి సిబ్బందిని, తల్లిదండ్రుల్ని శిక్షించాలి’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని