షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు: సి. కల్యాణ్‌

తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలోనే సినిమా చిత్రీకరణల అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి.కల్యాణ్‌ తెలిపారు.

Published : 03 Jun 2020 18:24 IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలోనే సినిమా చిత్రీకరణల అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి.కల్యాణ్‌ తెలిపారు. దర్శక, నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఉత్తర్వుల్లో మార్గదర్శకాలుంటాయని పేర్కొన్నారు. తలసాని ట్రస్టు ఆధ్వర్యంలో ఫిల్మ్‌ ఛాంబర్‌లో పలువురు పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇతర రాష్ట్రాలు విడుదల చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా చిత్రీకరణలు చేయడం అసాధ్యమన్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం సామరస్య పూర్వకంగా ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే తలసాని కుటుంబం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఈ సందర్భంగా సి.కల్యాణ్‌ ప్రకటించారు. కార్యక్రమంలో నిర్మాతలు కల్యాణ్‌, అభిషేక్‌ అగర్వాల్‌, తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని