HanuMan: ‘హనుమాన్‌’ అప్‌డేట్‌.. ఓటీటీ కన్నా ముందే టీవీలో ప్రసారం.. ఎప్పుడంటే?

బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘హనుమాన్‌’ సినిమా ఓటీటీ కన్నా ముందే టీవీలో ప్రసారం కానుంది. ఏ ఛానల్‌లో?ఎప్పుడంటే?

Published : 09 Mar 2024 00:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిట్‌ చిత్రం ‘హనుమాన్‌’ (HanuMan) ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ చిత్రం ఓటీటీ (HanuMan OTT Release) కన్నా ముందు టీవీలో ప్రసారం కానుంది. మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ (Colors Cineplex) ఛానల్‌, జియో సినిమా (Jio Cinema)లో కేవలం హిందీలో టెలికాస్ట్‌ అవుతుంది. ఈ వివరాలను కలర్స్‌ సినీప్లెక్స్‌ సంస్థ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దాన్ని రీట్వీట్‌ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లైంది.

మార్చి 2 నుంచి ‘జీ 5’లో ‘హనుమాన్‌’ స్ట్రీమింగ్‌ అవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత, మార్చి 8న విడుదలవుతుందని టాక్‌ వినిపించింది. దీంతో, కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో ‘జీ5’ (Zee 5) సంస్థ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని కోరారు. దానిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ రూ.330 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని