Hero: ‘హీరో’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

2022 సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘హీరో’. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు, నటుడు మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌ హీరోగా పరిచయమైన సినిమా ఇది. నిధి అగర్వాల్‌ కథానాయిక.

Updated : 07 Dec 2022 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2022 సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘హీరో’. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు, నటుడు మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌ హీరోగా పరిచయమైన సినిమా ఇది. నిధి అగర్వాల్‌ కథానాయిక. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. ఈ యాక్షన్‌ కామెడీ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో జగపతిబాబు, నరేష్‌, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్‌ సంగీతం అందించారు.

క‌థేంటంటే: సినిమా హీరో కావాల‌ని క‌ల‌లు క‌నే ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు అర్జున్ (అశోక్ గ‌ల్లా). ప‌క్కింటి అమ్మాయి సుబ్బు (నిధి అగ‌ర్వాల్‌) ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటారు. ఇంత‌లో అర్జున్‌కి ఓ కొరియ‌ర్ అందుతుంది. అందులో ఓ గ‌న్ ఉంటుంది. ముంబయి మాఫియాకి చెందిన గ‌న్ అది. ఆ త‌ర్వాత మరో కొరియ‌ర్‌లో చంప‌మ‌ని చెబుతూ ఓ ఫొటో అందుతుంది. ఆ గ‌న్‌, ఫొటోని అర్జున్‌కి పంప‌డానికి కార‌ణ‌మేంటి? ఇంత‌కీ ఆ ఫొటోలో ఎవ‌రున్నారు? ముంబయి మాఫియాకీ, అర్జున్‌కీ సంబంధ‌మేంటి? అర్జున్ హీరో అయ్యాడా? సుబ్బుని పెళ్లి చేసుకున్నాడా? అన్నది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని