అభిమానులు మెచ్చుకుంటేనే ఆనందం: తమన్నా

తమన్నా కథానాయికగా తమిళంలో నటిస్తున్న వెబ్‌సీరీస్‌ చిత్రం ‘నవంబర్‌ స్టోరీ’. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమమైన

Published : 13 May 2021 21:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తమన్నా కథానాయికగా తమిళంలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘నవంబర్‌ స్టోరీ’. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమమైన ఈ సినిమాకి ఇంద్ర సుబ్రమణియన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా గురించి తమన్నా స్పందిస్తూ..‘‘ఈ సినిమాలో నాలోని సృజనాత్మకతో పాటు నటనలో నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు సహాయపడింది. మనం ఏ పాత్ర అయితే పోషిస్తామో అది అభిమానులు మెచ్చుకొని ఆనందిస్తారో అప్పుడే నాకు నిజమైన ఆనందం ఉంటుంది. సినిమా చిత్రీకరణ చేసిన మొదటివారంలోనే కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేసాము. ఎందుకంటే ఆ పాత్రకి సంబంధించి మా టీం అంతగా సంతృప్తి చెందలేదు. చిత్రంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. డైలాగ్స్ మాడ్యులేషన్ పాటు ఎలా చెప్పాలి దానిపై కూడా చాలా శ్రద్ధ చూపాం. నా పాత్ర (అనురాధ) బాగా రావడానికి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి నటించా. అందుకే అనురాధ పాత్ర బాగా చేశానని నమ్ముతున్నాని’’ తెలిపింది.

చిత్రంలో జీఎం కుమార్‌ కీలక పాత్రలో నటించగా పసుపతి, వివేక్ ప్రసన్న, అరుళ్‌ దాస్‌, నందిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇటీవల సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. మే 20న  డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీలో తమిళ, తెలుగు, హిందీలో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రస్తుతం తమన్నా - గోపీచంద్‌తో కలిసి నటించిన ‘సీటీమార్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో తెలంగాణ కబడ్డీ కోచ్‌ జ్వాలారెడ్డిగా నటిస్తోంది. ఇంకా ఆమె ‘ఎఫ్ 3’ ‘గుర్తందా శీతాకాలం’, ‘మాస్ర్టో’ల్లో నాయికగా నటిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని