ఆ వదంతులు నమ్మొద్దు: ‘దృశ్యం’ దర్శకుడు

‘దృశ్యం’ సినిమాతో యావత్‌ భారతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు మలయాళ డైరెక్టర్‌ జీతూ జోసెఫ్‌. ఒక ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్‌ థ్రిల్లర్‌ను జత చేసి బిగుతైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశారు. ఒక ప్రాంతీయ సినిమా మిగిలిన భారతీయ భాషల్లోనే

Published : 01 Mar 2021 15:13 IST

కొచ్చిన్‌: ‘దృశ్యం’ సినిమాతో యావత్‌ భారతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు మలయాళ డైరెక్టర్‌ జీతూ జోసెఫ్‌. ఒక ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్‌ థ్రిల్లర్‌ను జత చేసి బిగి సడలని స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశారు. ఒక ప్రాంతీయ సినిమా మిగిలిన భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషలైన సింహళం, చైనీస్‌ భాషల్లో రీమేక్‌ అయ్యి రికార్డులకెక్కింది. దాని కొనసాగింపుగా ఇటీవల వచ్చిన ‘దృశ్యం-2’కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. త్వరలోనే ‘దృశ్యం-3’ని కూడా తెరకెక్కించనున్నట్టు జీతూజోసెఫ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే పార్ట్‌ 3 కి బయట రచయితల నుంచి కథలు తీసుకోనున్నట్టు జీతూ ప్రకటించారనే వదంతులు  సోషల్‌ మీడియాలో వచ్చాయి. అందులో భాగంగా కొందరు రచయితలు జీతూ పేరుమీద ఉన్న ఒక మెయిల్‌ ఐడీకి కథలు పంపుతున్నారనే వార్తలూ వచ్చాయి. ఇది తెలుసుకున్న ఆయన వాటిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

అందులో ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం వార్తల్లో ఉన్న మెయిల్‌ఐడీ నాదే అయినప్పటికీ, పార్ట్‌-3 కోసం బయటి రచయితల నుంచి స్కిప్ట్‌లను ఆహ్వనించలేదు. వచ్చే సీక్వెల్‌కు కూడా నేనే స్క్రిప్టు రాసుకుంటున్నాను. ఎవరూ ఆ మెయిల్‌ ఐడీకి మీరు రాసుకున్న స్క్రిప్ట్‌లను పంపొద్దు’ అంటూ వివరణ ఇచ్చారు. ‘దృశ్యం-3’కి సంబంధించి ఒక పాయింట్‌ను నటుడు మోహన్‌లాల్‌తో పాటు చిత్ర నిర్మాత పెరంబవూర్‌తో కూడా చర్చించానని, వారిద్దరికీ ఆ అంశం నచ్చిందని ఇటీవలే జీతూ ప్రకటించారు. కానీ, ఆ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి రెండేళ్ల పైనే పట్టొచ్చని వెల్లడించిన విషయం విదితమే. తెలుగులో తెరకెక్కనున్న ‘దశ్యం2’ రీమేక్‌కు  జీతూనే దర్శకత్వం వహించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని