Priya Prakash Varrier: నా తల్లిదండ్రులకు సారీ చెబుతా: ప్రియా ప్రకాశ్ వారియర్‌

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. ఈ సినిమా గురించి నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 20 Jul 2023 20:19 IST

హైదరాబాద్‌: ‘బ్రో’ (BRO)తో మరి కొన్నిరోజుల్లో వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier). పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ప్రియ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘బ్రో’లో ఆఫర్‌ వచ్చినప్పుడు మొదట నేను నమ్మలేదు. మొదటిరోజు సెట్‌లో పవన్‌కల్యాణ్‌ని చూసి ఎంతో ఆనందంగా అనిపించింది. కంగారు పడ్డా. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. సాయి చాలా ఫ్రెండ్లీ. వాళ్లిద్దరితో నాకు కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నాయి. ఇలాంటి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్వంగా ఉన్నా’’ అని ఆమె చెప్పారు.

ఈ రాత్రి ఎప్పటికీ గుర్తుంటుందన్న ‘బ్రో’ నటి.. కోస్టార్‌తో ‘బవాల్‌’ బ్యూటీ..!

అనంతరం విలేకరి ‘‘ఒకవేళ మీరు సారీ, థ్యాంక్స్‌ చెప్పాల్సి వస్తే ఎవరికి చెబుతారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘థ్యాంక్యూ, సారీ రెండూ నా తల్లిదండ్రులకే చెబుతా. వాళ్ల ప్రోత్సహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక, టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను ఎన్నో ఆకతాయి పనులు చేశా. అమ్మ వాళ్లకు అవి నచ్చేవి కాదు. కాబట్టి, అప్పుడు చేసిన పనులన్నింటికీ ఇప్పుడు సారీ చెబుతా’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని