IIFA 2023: ఐఫా-2023 టెక్నికల్‌ అవార్డులు.. కీలకమైన ఆ మూడూ ‘గంగూబాయి’ ఖాతాలోనే..!

‘ఐఫా - 2023’ (IIFA 2023) టెక్నికల్‌ అవార్డుల ప్రదానోత్సవం తాజాగా దుబాయ్‌లో వేడుకగా జరిగింది. అలియాభట్‌ (AliaBhatt) నటించిన ‘గంగూబాయి కాఠియావాడి’ (Gangubai Kathiawadi) సినిమా మూడు అవార్డులు అందుకోగా.. కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan) నటించిన ‘భూల్‌ భూలయ్యా-2’ (Bhool Bhulaiyaa 2) రెండు అవార్డులు దక్కించుకుంది.

Published : 27 May 2023 17:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దుబాయ్‌ వేదికగా ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు (ఐఫా)-2023 (IIFA 2023) ప్రదానోత్సవం జరిగింది. సల్మాన్‌ఖాన్‌, విక్కీ కౌశల్‌, వరుణ్‌ ధావన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నోరా ఫతేహి, తదితర అగ్ర, యువ నటీనటులు పాల్గొన్న ఈ వేడుకలో ‘ఐఫా 2023’ టెక్నికల్‌ అవార్డులను తాజాగా అందజేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ.. ఇలా తొమ్మిది విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. సినిమాపరంగా ప్రధానంగా భావించే స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, సినిమాటోగ్రఫీ అవార్డులను సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కాఠియావాడి’ (Gangubai Kathiawadi) దక్కించుకుంది.

ఐఫా-2023 టెక్నికల్‌ అవార్డులు-విజేతలు:

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: సందీప్‌ ఛటర్జీ (గంగూబాయి కాఠియావాడి)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే: సంజయ్‌ లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ఠ (గంగూబాయి కాఠాయావాడి)
బెస్ట్‌ డైలాగ్స్‌: ఉత్కర్షిణి వశిష్ఠ, ప్రకాశ్‌ కాపాడియా (గంగూబాయి కాఠియావాడి)
బెస్ట్‌ కొరియోగ్రఫీ: బోస్కో-సీజర్ (భూల్‌ భులయ్యా-2)
బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: మందార్‌ కులకర్ణి (భూల్‌ భులయ్యా-2)
బెస్ట్‌ ఎడిటింగ్‌: సందీప్‌ ఫ్రాన్సిస్‌ (దృశ్యం 2)
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌: రెడిఫైన్‌ (బ్రహ్మాస్త్ర)
బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌: శ్యామ్‌ సీఎస్‌ (విక్రమ్‌ వేద)
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌: గుంజన్‌ ఏ షా, బోలోయ్ కుమార్ (మౌనికా ఓ మై డార్లింగ్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని