Indiana Jones: యాక్షన్‌ ప్రియులకు పండగే.. ఓటీటీలో ఇండియానా జోన్స్‌ చిత్రాలు

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తెరకెక్కించిన ‘ఇండియానా జోన్స్‌’ (Indiana Jones) చిత్రాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. ఈ మేరకు డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) ఓ ప్రకటన విడుదల చేసింది.

Published : 26 May 2023 22:39 IST

హైదరాబాద్‌: సినిమా ఇండస్ట్రీలో దర్శక దిగ్గజం అనగానే మొదట గుర్తొచ్చేపేరు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (Steven Spielberg). ఎన్నో అద్భుతమైన చిత్రాలతో సినీ ప్రియులకే కాదు.. సినీ ప్రముఖులకు ఫేవరేట్‌ అయ్యారు. ఆయన సినిమాల్లో టాప్‌ లిస్ట్‌లో ఉండేవి ‘ఇండియానా జోన్స్‌’ (Indiana Jones) చిత్రాలు. ఈ నాలుగు భాగాలు యాక్షన్‌, అడ్వెంచర్‌ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఐదో భాగం ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ డయల్‌ ఆఫ్‌ డెస్టినీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మొత్తం సిరీస్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాంటి వారికి డిస్నీ+ హాట్‌స్టార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సినిమాలు మే 31 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో (Disney+ Hotstar) స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించింది. 

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తెరకెక్కించిన ఈ నాలుగు సినిమాలు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను అందుకొని ప్రపంచ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించాయి. మొదటి భాగం 1981లో ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ రైడర్స్‌ ఆఫ్‌ ద లాస్ట్‌ ఆర్క్‌’ (Indiana Jones and the Raiders of the Lost Ark) పేరుతో రూపొందించారు. ఇప్పుడు 42 ఏళ్ల తర్వాత ఐదో భాగం ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’ పేరుతో రానుంది. మొదటి భాగంలో హీరోగా నటించిన హారిసన్‌ ఫోర్డ్‌ (Harrison Ford) ఐదో భాగంలోనూ కథానాయకుడిగా కనిపించనుండడం విశేషం. ఇక 1984లో విడుదలైన రెండో భాగం ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది టెంపుల్‌ ఆఫ్‌ ది డూమ్‌’ను కొన్ని ప్రాంతాల్లో నిషేధం విధించారు. అప్పట్లో  ఈ వార్త సంచలనం సృష్టించింది. 1989 ఈ సీరీస్‌ మూడో భాగం విడుదలైన అన్నీ ప్రాంతాల్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. చివరిగా 2008లో ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ క్రిస్టల్‌ స్కల్‌’ వచ్చింది. యాక్షన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ నాలుగు చిత్రాలు డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని