Updated : 14 Aug 2022 06:59 IST

Keerthy Suresh: సుధా కొంగర దర్శకత్వంలో..

‘ఆకాశమే నీ హద్దురా’ (Aakasam Nee Haddura) చిత్రంతో జాతీయ స్థాయిలో మెరిశారు  దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara). ఆమె ఈ సినిమాని ప్రస్తుతం హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా పూర్తి కాగానే సుధా ఓ నాయికా ప్రాధాన్య చిత్రం తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రధాన పాత్రధారిగా నటి కీర్తి సురేష్‌ను (Keerthy Suresh) ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో కీర్తి ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించనుంది. కీర్తి ప్రస్తుతం నానితో ‘దసరా’లో.. చిరంజీవితో ‘భోళా శంకర్‌’లో కలిసి నటిస్తోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని