Vanitha: నాలుగో పెళ్లి వార్తలపై నటి కౌంటర్‌

ప్రముఖ నటుడు విజయ్‌కుమార్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, దక్షిణాదిలో తెరకెక్కిన పలు చిత్రాల్లో నటించారు నటి వనితా విజయ్‌కుమార్‌.....

Published : 13 Jun 2021 01:10 IST

చెన్నై: ప్రముఖ నటుడు విజయ్‌కుమార్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, దక్షిణాదిలో తెరకెక్కిన పలు చిత్రాల్లో నటించారు నటి వనితా విజయ్‌కుమార్‌. ప్రస్తుతం కెరీర్‌పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ గత కొంతకాలం నుంచి ఈ నటి వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవాలను చవిచూస్తున్నారు. ఇప్పటికే  మూడు  పెళ్లిళ్లు చేసుకున్న ఆమె వైవాహిక బంధంలో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు కూడా తీసుకున్నారు. కాగా, వనిత త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోనుందంటూ గత కొన్నిరోజులుగా కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

‘ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. ఇకపై ఇలాగే ఉంటాను. దయచేసి, నా జీవితం గురించి అసత్య వార్తలు వ్యాప్తి చేయకండి. ఆ వార్తలు కూడా నమ్మకండి. నా జీవితం ఎవ్వరికీ సమస్య కాదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉన్నాయి వాటి గురించి చూడండి. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్న వాళ్లు.. నా గురించి కాకుండా మీ జీవితం గురించి బాధపడండి’ అని వనితా విజయ్‌కుమార్‌ తెలిపారు. మరోవైపు తెలుగులో తెరకెక్కిన ‘దేవి’తో ఈ భామ తెలుగువారికి సుపరిచితురాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని