Vishal: అది నయనతార వ్యక్తిగత విషయం.. మేం ఇబ్బంది పెట్టం: విశాల్‌

2008లో విడుదలైన ‘సెల్యూట్‌’తో ప్రేక్షకులను అలరించారు విశాల్‌ (Vishal) - నయనతార (Nayanthara). ప్రస్తుతం నడిగర్‌ సంఘంలో కీలక సభ్యుడిగా కొనసాగుతోన్న విశాల్‌.. నయన్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 29 Jul 2023 13:12 IST

చెన్నై: నటి నయనతార (Nayanthara)ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్‌ (Vishal). సినిమా ప్రమోషన్స్‌లో నయనతార ఎప్పుడూ పాల్గొనలేదన్నారు. ఆ విషయంలో ఆమెను ఇబ్బందిపెట్టబోమని చెప్పారు. అంతేకాకుండా, రాజకీయ రంగ ప్రవేశంపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విశాల్‌ మాట్లాడుతూ ‘‘రాజకీయాలు సామాజిక సేవకు సంబంధించినవి. ప్రజలకు అవసరమైన సేవలు చేయడమే రాజకీయ నాయకుల ప్రథమ లక్ష్యం. ఇది వ్యాపారం కాదు. అలా చూసుకుంటే.. నేను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేశాను. కాబట్టి ప్రత్యేకంగా మళ్లీ పాలిటిక్స్‌లోకి రావాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు నటులు అవుతున్నప్పుడు.. నటులు రాజకీయ నాయకులు కావడంలో ఎలాంటి తప్పు లేదు’’ అని విశాల్‌ బదులిచ్చారు.

Social Look: బికినీలో శ్రద్ధ.. దివి కవిత్వం.. తమన్నా డ్యాన్స్‌ రిహార్సల్స్‌..!

అనంతరం ఆయన, సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనని నటులను ఉద్దేశిస్తూ.. ‘‘తాను నటించిన సినిమా ప్రమోషన్స్‌కు నయనతార ఎప్పుడూ హాజరు కాలేదు. అది ఆమె వ్యక్తిగత హక్కు. కాబట్టి, ఈవెంట్స్‌కు రమ్మని ఆమెను బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే, నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నటీనటులు సినిమా ప్రమోషన్స్‌కు హాజరైతే బాగుంటుంది’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు