Kajal: సూర్య, జ్యోతికలకు అభినందనలు చెప్పిన కాజల్‌..!

చందమామ భామ కాజల్ ట్విటర్‌ వేదికగా సూర్య, జ్యోతికలకు అభినందనలు తెలిపింది.

Published : 04 Oct 2022 11:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్య నటించిన సూరారై పోట్రు( ఆకాశం నీ హద్దురా) సినిమా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో 5 అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సూర్య కుటుంబ సమేతంగా హాజరై ఉత్తమ నటుడు అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చందమామ భామ కాజల్ ట్విటర్‌ వేదికగా సూర్య, జ్యోతికలకు అభినందనలు తెలిపింది. ‘‘జాతీయ అవార్డు అందుకున్నందుకు మీకు అభినందనలు. మీరు ఆ అవార్డు అందుకోడానికి అర్హులు’ అంటూ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది 

కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందిన చిత్రమే సూరారై పోట్రు. దీనిని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రశంసలే కాకుండా అవార్డుల పంట పండింది. ఏకంగా 5 జాతీయ అవార్డులను ఈ చిత్రం తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ నటుడు(సూర్య), ఉత్తమ నటి (అపర్ణ)తో పాటు ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ స్ర్కీన్‌ప్లే కుగాను అవార్డులు వచ్చాయి. ఇక ఈ చిత్రం హిందీలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని