Kajol: అత్యంత కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను: కాజోల్
ప్రముఖ హీరోయిన్ కాజోల్ (Kajol) సోషల్ మీడియాకు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు పెట్టిన ఫొటోలను డిలీట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడూ సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే కథానాయికల్లో స్టార్ హీరోయిన్ కాజోల్ (Kajol) ఒకరు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేయడంతో పాటు అభిమానుల కామెంట్స్‌కు కూడా రిప్లై ఇస్తుంటుంది. తాజాగా కాజోల్ సోషల్‌మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఇప్పటి వరకు ఇన్‌స్టాలో ఉన్న తన ఫొటోలను డిలీట్ చేసిన కాజోల్ కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ‘ప్రస్తుతం జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను’ అని తెలిపింది. అయితే, కాజోల్ పెట్టిన పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరేమో ఏమైందని కామెంట్స్ పెడుతుండగా మరొకొందరేమో ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఏలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం కాజోల్ ‘ది గుడ్ వైఫ్’ (The Good Wife) వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె లాయర్‌గా కనిపించనుంది. ఇది ఆమె తొలి ఓటీటీ సిరీస్ అవ్వడంతో దీని ప్రమోషన్స్ కోసమే కాజోల్ ఈ క్యాప్షన్ పెట్టి ఫొటోలన్నీ డిలీట్ చేసిందనుకుంటున్నారు. అలాగే ‘లస్ట్ స్టోరీస్2’లోనూ కాజోల్ నటిస్తోంది. తమన్నా, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్ తాజాగా విడుదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Social Look: చీరలో పూజా మెరుపులు.. రకుల్ పోజులు.. దివి కవిత్వం ఎవరికోసమో తెలుసా..?
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!