The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’పై కమల్‌ హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) పై ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

Published : 28 May 2023 13:40 IST

హైదరాబాద్‌: అదాశర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఎన్నో విమర్శల మధ్యే మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఈ చిత్రంపై చేసిన కామెంట్స్‌ వైరలవుతున్నాయి. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ఈ నటుడు ‘ది కేరళ స్టోరీ’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ప్రచార చిత్రాలు నచ్చవు. అలాంటి వాటికి నేను పూర్తి వ్యతిరేకిని. సినిమా టైటిల్‌ కింద ‘నిజమైన కథ’ అని రాయగానే సరిపోదు. అలా రాసినంత మాత్రన అది నిజంగా జరిగిన కథ అవ్వదు’’ అని అన్నారు.

ఇక కేరళ స్టోరీ ట్రైలర్‌ వచ్చినప్పటి నుంచి కొంతమంది ప్రేక్షకులు దీన్ని విమర్శిస్తూనే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీనిపై నిషేధం విధించిన విషయమూ తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేసిన అదాశర్మ ఇన్‌ స్టా వేదికగా ఓ నోట్‌ను రాసింది. ‘‘దేశంలోని రెండు రాష్ట్రాలు దీనిపై నిషేధం విధించాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇది నేను అసలు ఊహించలేదు. నా అంచనాలకు మించి ఈ చిత్రం విజయం సాధించింది’’ అంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని