Kangana Ranaut: డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన కంగనా రనౌత్‌.. మిస్టరీ మ్యాన్‌ ఎవరంటే!

తనతో ఉన్న మిస్టరీ మ్యాన్‌ ఎవరో కంగనా రనౌత్‌ చెప్పేశారు. దీంతో డేటింగ్‌ రూమర్స్‌కు చెక్‌ పడింది.

Published : 14 Jan 2024 10:36 IST

ముంబయి: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana ranaut) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ముంబయిలో ఆమె ఓ యువకుడి చేయి పట్టుకుని సరదాగా వెళ్తూ కనిపించారు. దీంతో అతడితో డేటింగ్‌లో ఉందంటూ పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిపై తాజాగా ఆమె స్పందించారు.

‘‘సెలూన్‌లో నాతో పాటు ఉన్న మిస్టరీ మ్యాన్‌ ఎవరని అడుగుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ నన్ను ట్యాగ్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి క్లోజ్‌గా కనిపిస్తే.. వారి మధ్య ప్రేమ ఉందని ఊహించుకుంటారా? చనువుగా ఉండడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయి. వారు తోబుట్టువులు, సహోద్యోగులు అయి ఉండొచ్చు. నాతో ఉన్న వ్యక్తి  నా హెయిర్‌ స్టైలిష్ట్‌. నేను కొన్ని సంవత్సరాలుగా అతడి ఫ్రెండ్లీ కస్టమర్‌ని’’ అని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. దీంతో ఈ డేటింగ్‌ రూమర్స్‌కు చెక్‌ పడినట్లైంది.

సినిమాల విషయానికొస్తే కంగన నటించిన ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆమె స్వీయ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు సైకలాజికల్‌ థ్రిల్లర్‌కు సైన్‌ చేశారు.  ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’తో ప్రేక్షకులను అలరించిన కంగన, మాధవన్‌ల కాంబోలో 8 ఏళ్ల తర్వాత రాబోతున్న చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని