Suriya: రాజు రాకకు వేళాయే

సూర్య కథానాయకుడిగా శివ రూపొందిస్తున్న బహుభాషా చిత్రం ‘కంగువ’. స్టూడియో గ్రీన్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 21 Jul 2023 13:49 IST

సూర్య కథానాయకుడిగా శివ రూపొందిస్తున్న బహుభాషా చిత్రం ‘కంగువ’. స్టూడియో గ్రీన్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ కథానాయిక. ఈ చిత్ర తొలి గ్లింప్స్‌ను ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. అందులో సూర్య ముఖం చూపించకున్నా.. ఖడ్గం పట్టుకొని యుద్ధ రంగంలో నిల్చున్నట్లుగా ఉన్న ఆయన లుక్‌ ఆసక్తికరంగా ఉంది. ‘‘ప్రతి దెబ్బ వెనక ఓ కథ ఉంది. ఓ మనిషి క్రూరమైన కథ. రాజు వస్తున్నాడు’’ అంటూ ఆ పోస్టర్‌పై ఉన్న వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య శక్తిమంతమైన రాజు పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా 2డి, 3డి వెర్షన్‌లలో వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని