Karthikeya: చిరు టైటిల్‌తో కార్తికేయ కొత్త సినిమా

నటుడు కార్తికేయ హీరోగా సరికొత్త చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ సారిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి ‘రాజా విక్రమార్క’...

Published : 20 Jun 2021 16:15 IST

ఇంతకు మించిన అర్హత ఏముంది

హైదరాబాద్‌: నటుడు కార్తికేయ హీరోగా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ సారిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి ‘రాజా విక్రమార్క’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం సినిమా టైటిల్‌ పోస్టర్‌ని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా విడుదల చేసి చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. అనంతరం కార్తికేయ సైతం పోస్టర్‌ని షేర్‌ చేస్తూ.. ‘విక్రమార్క.. రాజా విక్రమార్క.. బిగ్‌బాస్‌ చిరంజీవి సినిమా టైటిల్‌ని నా సినిమాకి ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అభిమానానికి మించిన అర్హత ఏముంది?’ అని ట్వీట్‌ చేశారు.

‘చావు కబురు చల్లగా’ తర్వాత కార్తికేయ నటిస్తున్న చిత్రమిదే. పోస్టర్‌ని బట్టి చూస్తుంటే ఈ చిత్రంలో కార్తికేయ... క్లాస్‌+మాస్‌ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శ్రీ చిత్ర మూవీ మేకర్స్‌ పతాకంపై రమారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌.విహారి స్వరాలు అందించనున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని