Katrina Kaif: నన్ను పరీక్షించిన సినిమా ఇది!

‘‘టైగర్‌’.. నా సహనాన్ని, ఓర్పును ఎంతో పరీక్షించింది. నా శక్తిని గుర్తు చేసింద’’ని అంటోంది బాలీవుడ్‌ నాయిక కత్రినా కైఫ్‌. ఆమె.. సల్మాన్‌ ఖాన్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది.

Updated : 12 Nov 2023 12:28 IST

‘‘టైగర్‌’.. నా సహనాన్ని, ఓర్పును ఎంతో పరీక్షించింది. నా శక్తిని గుర్తు చేసింద’’ని అంటోంది బాలీవుడ్‌ నాయిక కత్రినా కైఫ్‌. ఆమె.. సల్మాన్‌ ఖాన్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. మనీష్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. ఇందులో జోయా పాత్రలో కనిపిస్తూ.. కళ్లు చెదిరే యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుందీ భామ. ఈ సినిమాలో ఎన్నో హైలెట్‌ షాట్స్‌ ఉన్నా కత్రినా.. మిచెల్‌లీ మధ్య జరిగిన టవల్‌ ఫైట్‌ సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సినిమాలోని పోరాట సన్నివేశాల కోసం తన శక్తికి మించి ప్రయత్నించినట్టుగా తెలిపింది కత్రినా. తాజాగా ఈ సినిమా కోసం ఆమె ఎలా సన్నద్దమైందో.. తాను పడిన శ్రమ గురించి ఓ వీడియోను పంచుకుంది. ‘‘టైగర్‌’ సినిమా నాలోని శక్తిని, సత్తాను మించి నటించేలా చేసింది. నా ఓర్పును పరీక్షించింది. నాలో ఉన్న బలాన్ని నాకే చూపించింది. ఈ సినిమా షూట్‌ చేస్తున్నప్పుడు చాలా రోజులు నేను ఎంతో అలసిపోయాను. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నంగా అనిపించింది. ఇది చాలా కఠినమైంది. ఇందులోని పోరాటాలు సన్నివేశాలు చేస్తుంటే ఎంతో నొప్పిగా ఉండేది. కానీ నేను దానిని సవాలుగా తీసుకున్నాను. నేను అలసిపోయినా.. నా లోపల ఉన్న సంకల్పం మాత్రం అలసిపోదు. నేను పడిన కష్టానికి ప్రతిఫలం ట్రైలర్‌ చూశాక అర్థమైంది. మునుపెన్నడూ చూడని యాక్షన్‌ సీక్వెన్స్‌, థ్రిల్‌ను త్వరలో చూపిస్తామ’ని చెప్పుకొచ్చింది కత్రినా. ఈ సినిమా ఆదివారం విడుదలవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని