Kavitha: రూ.132 కోట్లు పోయాయి.. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది: నటి కవిత

నటి, సహాయ నటిగా తెలుగువారికి సుపరిచితురాలైన వ్యక్తి కవిత (Kavitha). ఎన్నో ఏళ్ల పాటు పరిశ్రమలో ఉన్న ఆమె తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 15 May 2023 01:32 IST

హైదరాబాద్‌: చిన్న పల్లెటూరు నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కథానాయిక, సహాయనటిగా ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగారు నటి కవిత (Kavitha). నటిగా రాణిస్తోన్న సమయంలోనే వందల కోట్ల ఆస్తి ఉన్న ఒక కోటీశ్వరుడిని వివాహం చేసుకున్న ఆమె.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినా, కొన్ని కారణాల వల్ల 20 ఏళ్లకే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి అయ్యాక సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. దీంతో అప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి.. వెండితెరకు దూరమయ్యా. కాకపోతే, కొన్నేళ్ల గ్యాప్‌ తర్వాత సహాయ నటిగా ఎంట్రీ ఇచ్చాను. అమ్మ, వదిన, కోడలుగా ఇలా ఎన్నో సినిమాలు చేశాను’’

‘‘మా వారికి వందల కోట్ల ఆస్తులు ఉన్న మాట వాస్తవమే. 11 దేశాల్లో ఆయనకు ఆయిల్‌ బిజినెస్‌లు ఉండేవి. ఆయన నన్ను ఒక రాణిలా చూసుకునేవారు. నా ఇష్టాలను గౌరవించేవారు. ఏడేళ్ల క్రితం వ్యాపారంలో నష్టం రావడంతో  సుమారు రూ.132 కోట్లు పోగొట్టుకున్నారు. కొన్ని ఆస్తులు కూడా అమ్మేశారు. అప్పుడు ఎంతో ఒత్తిడికి గురయ్యారు. దానివల్ల 11 రోజులపాటు కోమాలో ఉన్నారు. కరోనా అందరి జీవితాల్లో ఏదో ఒక రకంగా చీకట్లు మిగిల్చింది. నా భర్త, కుమారుడు అదే సమయంలో చనిపోయారు. బాబు చనిపోయిన పది రోజులకే ఆయన కూడా కన్నుమూశారు. ఆ బాధను తట్టుకోలేక చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. నా కుమార్తెలను చూసి ఆగిపోయా. ఆ బాధ నుంచి బయటపడటం కోసమే మళ్లీ సినిమాల్లో బిజీ కావాలనుకుంటున్నా. అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తా’’ అని ఆమె వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు