Keerthy Suresh: బంగారం లాంటి మనసు చాటుకున్న కీర్తి సురేష్..!
నాని, కీర్తి సురేష్ కలిసి నటించిన సినిమా ‘దసరా’. ఈ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో అలరించనుంది. తాజాగా ఈ మహానటికి సంబంధించిన ఓ వార్త తెగ ప్రచారమవుతోంది.
హైదరాబాద్: నాని (Nani) పూర్తి మాస్ అవతారంలో కనిపించనున్న సినిమా ‘దసరా’ (Dasara). ఈ సినిమాలో ఆయన సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆడిపాడనుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త తెగ ప్రచారమవుతోంది. ‘దసరా’ సినిమా లాస్ట్‌డే షూటింగ్ రోజు కీర్తి ఎమోషనల్ అయిందిట.
అలాగే దసరా సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక సెట్‌లో పని చేసిన వారందరికీ కీర్తి గోల్డ్ కాయిన్స్ పంచిపెట్టిందట. మొత్తం 130 మందికి కీర్తి బంగారు నాణెలను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ మహానటి బంగారం లాంటి మనసు చాటుకుందని కామెంట్స్ చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక గతంలోనూ కొందరు హీరోలు వారి సినిమాల కోసం పనిచేసిన వారికి గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక సెట్‌లోని వారికి రామ్ చరణ్ బంగారు నాణెలను బహుమతిగా ఇచ్చారు. అలాగే ‘పుష్ప’ సినిమా సమయంలో అల్లు అర్జున్ కూడా టీంకు ఇలాంటి ఖరీదైన బహుమతులు ఇందించారు. టీం అందరికీ గోల్డ్ కాయిన్స్ ఇచ్చి సర్‌ప్రైస్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Polavaram project: 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం
-
Politics News
CM Jagan-Balineni: సీఎం జగన్‌తో బాలినేని భేటీ.. నేతల మధ్య విభేదాలపై చర్చ
-
World News
Sudan: ఆకలికి తట్టుకోలేక 60 మంది చిన్నారులు మృతి.. పాలు లేక నీళ్లు తాగిస్తున్న దృశ్యాలు..!
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Viveka Murder case: సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భాస్కర్‌రెడ్డి
-
World News
Vivek: చైనాలో ఎలాన్ మస్క్ పర్యటన ఆందోళనకరమే : వివేక్ రామస్వామి