Keerthy Suresh: షూట్‌కు గంట ముందు లుక్‌ టెస్ట్‌

‘‘మామన్నన్‌’ తమిళంలో గొప్ప విజయాన్ని సాధించింది. అందులోని ఎమోషన్‌కు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్‌ అవ్వడం గొప్ప ఆనందాన్నిస్తోంది’’ అంది కీర్తి సురేష్‌.

Updated : 15 Jul 2023 14:08 IST

‘‘మామన్నన్‌’ తమిళంలో గొప్ప విజయాన్ని సాధించింది. అందులోని ఎమోషన్‌కు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్‌ అవ్వడం గొప్ప ఆనందాన్నిస్తోంది’’ అంది కీర్తి సురేష్‌ (Keerthy Suresh). ఆమె.. ఉదయనిధి స్టాలిన్‌, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని మారి సెల్వరాజ్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ‘నాయకుడు’ పేరుతో ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే కీర్తి తాజాగా విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది. ‘‘మారి సెల్వరాజ్‌ కథల్లో నటించాలని ప్రతి నాయికకూ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆయన కథల్లో మహిళా పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆయన నాకీ కథ చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. అయితే ఆయన చెప్పిన దాని కన్నా నాలుగు రెట్లు ప్రభావవంతంగా తెరపై చూపించారు. చిన్నగా మొదలైన గొడవ ఏ స్థాయికి వెళ్తుంది? దాని వల్ల ఎదురయ్యే పరిణామాలేంటి? అన్నది ఇందులో అద్భుతంగా చూపించారు. నిజానికి ఈ సినిమాకి ముందు నాకు లుక్‌ టెస్ట్‌ చేయలేదు. కానీ, చిత్రీకరణకు గంట ముందు లుక్‌ టెస్ట్‌ చేసి నన్ను ఫైనల్‌ చేశారు. ఈ చిత్రం కోసం ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆయన సెట్స్‌లో ఎంతో సరదాగా ఉంటారు. రెహమాన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింద’’ని చెప్పుకొచ్చారు కీర్తి సురేష్‌. ఆమె ప్రస్తుతం తమిళంలో ‘సైరన్‌’, ‘రఘు తాత’, ‘రివాల్వర్‌ రీటా’ చిత్రాలతో పాటు తెలుగులో ‘భోళా శంకర్‌’తో అలరించనున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని