KGF Chapter 2: ‘కేజీయఫ్‌ 2’.. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?

భారతీయ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ గురువారం విడుదలై, హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలతోపాటు వసూళ్లనూ అధిక మొత్తంలో రాబడుతోంది.

Updated : 15 Apr 2022 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ గురువారం విడుదలై, అన్ని కేంద్రాల్లోనూ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలతోపాటు వసూళ్లనూ అధిక మొత్తంలో రాబడుతోంది. ఈ నేపథ్యంలో తొలిరోజు కలెక్షన్స్‌పై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా రూ. 134.5 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిందని వెల్లడించింది. సినిమా ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రంలోని హీరో యశ్‌ నటన, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వ ప్రతిభ, రవి బస్రూర్‌ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినీ ప్రముఖులనూ ఫిదా చేస్తోంది. ఇదే కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’కు ‘ఛాప్టర్‌ 2’ కొనసాగింపుగా రూపొందిందనే సంగతి తెలిసిందే. ఇందులోనూ శ్రీనిధి శెట్టి కథానాయికగా సందడి చేసింది. సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని