KGF Chapter 2: హిందీలోనూ అదరగొడుతున్న కేజీయఫ్‌2

ప్రస్తుతం సినిమా కబుర్లు చెప్పుకొనే ఏ ఇద్దరి నోట విన్నా ‘కేజీయఫ్‌2’(KGF Chapter 2) సంగతులే. రాఖీభాయ్‌గా యశ్(Yash) నటన, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌

Updated : 16 Apr 2022 16:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం సినిమా కబుర్లు చెప్పుకొనే ఏ ఇద్దరి నోట విన్నా ‘కేజీయఫ్‌2’(KGF Chapter 2) సంగతులే. రాఖీభాయ్‌గా యశ్(Yash) నటన, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. పాన్‌ ఇండియా సినిమాగా విడుదలైన ‘కేజీయఫ్2’ బాలీవుడ్‌లోనూ రికార్డులు తిరగరాస్తోంది. దేశవ్యాప్తంగా విడుదలైన రెండో రోజే ఈ సినిమా రూ.240 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. ఒక్క హిందీలోనే రూ.100కోట్ల మార్కును దాటినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస సెలవులు రావటం, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫీవర్‌ తగ్గడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇక ఈ శని, ఆది వారాల్లో మరింత స్థాయి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.  రాఖీభాయ్‌ ఈ జోరు కొనసాగిస్తే, ఈ వీకెండ్‌తో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇటీవల రూ.1000కోట్ల కలెక్షన్లతో రికార్డు సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను అధిగమిస్తుందా? లేదో చూడాలి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts