Laal Singh Chaddha: లాల్‌ సింగ్‌ చద్దా ఫ్లాప్... ఆమిర్‌ఖాన్‌పై ప్రభావం చూపింది: కిరణ్‌ రావ్‌

‘లాల్‌ సింగ్‌ చద్దా’ గురించి కిరణ్‌రావ్‌ ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. 

Published : 11 Feb 2024 14:34 IST

ముంబయి: ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) నాలుగేళ్ల విరామం తర్వాత నటిచించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ (Laal Singh Chaddha). దీనిని అద్వైత్ చందన్‌ తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సీఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది. ఈ చిత్రం గురించి కిరణ్‌రావ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించనప్పుడు నిరుత్సాహపడుతుంటాం. లాల్‌ సింగ్‌ చద్దా విషయంలో ఇదే రుజువైంది. ఈ సినిమా పరాజయం ఆమిర్‌ ఖాన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆమిర్‌ను మాత్రమే కాదు మొత్తం చిత్ర బృందాన్ని ప్రభావితం చేసింది. ఇది ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. దీనికోసం చాలా కష్టపడ్డారు. కానీ ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఈ ఓటమిని నేను అంగీకరిస్తున్నా. ఎందుకంటే వైఫల్యాల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యాక్షన్‌, క్రైమ్‌, కామెడీ, రొమాంటిక్‌ చిత్రాలు ఏవైనా ఒక ఫార్ములా ప్రకారం చేస్తుంటారు. చిత్రనిర్మాతలు కూడా ప్రేక్షకులకు నచ్చే కథలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు’’ అని అన్నారు.
 
ఆమిర్‌ఖాన్‌ తాజాగా ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం దీని చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌ చివరికి దాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘తారే జమీన్‌ పర్‌’ తరహాలోనే ఇదీ రానుంది. ఆ చిత్రం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. కానీ, ఈ సినిమా అందరినీ నవ్విస్తుందని ఆమిర్ ఓ సందర్భంలో చెప్పారు.
కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’ (Laapataa Ladies) చిత్రాన్ని ఆమిర్‌ఖాన్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కామెడీ డ్రామాగా రానున్న ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(టీఐఎఫ్ఎఫ్‌)లో ప్రదర్శించారు. మార్చిలో ఇది విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని