Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్‌..

కొణిదెల కుటుంబం నుంచి పరిశ్రమలోకి అడుగుపెట్టిన మరో నటుడు పవన్‌ తేజ్‌ (Pavan Tej) ఓ ఇంటి వాడవుతున్నాడు. నటి, బుల్లితెర వ్యాఖ్యాత మేఘనతో (Meghana) ఆయన ఏడడుగులు వేయనున్నారు. హైదరాబాద్‌లోని....

Updated : 07 Dec 2022 18:18 IST

హైదరాబాద్‌: కొణిదెల కుటుంబం నుంచి పరిశ్రమలోకి అడుగుపెట్టిన మరో నటుడు పవన్‌ తేజ్‌ (Pavan Tej) ఓ ఇంటి వాడవుతున్నాడు. నటి, బుల్లితెర వ్యాఖ్యాత మేఘనతో (Meghana) ఆయన ఏడడుగులు వేయనున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వీరి నిశ్చితార్థం బుధవారం సాయంత్రం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి సురేఖ, దర్శకుడు మెహర్‌ రమేశ్‌, సుమ - రాజీవ్‌ కనకాల దంపతులు హాజరయ్యారు. ఈ జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలను పవన్‌ తేజ్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘నిశ్చితార్థం జరిగింది. ప్రేమతో మా ప్రయాణం మొదలైంది. ఆమె వల్లే అసలైన ప్రేమకు అర్థం తెలిసింది. ఈ వేడుకలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించిన సురేఖ చిన్నమ్మకు ధన్యవాదాలు. చిరంజీవి బాబాయ్‌.. చిన్నతనం నుంచి నాకెంతో సపోర్ట్‌ చేశారు’’ అని పవన్‌ తేజ్‌ రాసుకొచ్చారు.

‘ఈ కథలో పాత్రలు కల్పితం’తో పవన్‌ తేజ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అదే సినిమాలో మేఘన కథానాయికగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటున్నారు. ఇక, ఈటీవీలో ప్రసారమైన ‘రెచ్చిపోదాం బ్రదర్‌’ అనే కార్యక్రమానికి మేఘన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని