Bhaag Saale: యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘భాగ్‌ సాలే’లోని పాట..

భాగ్‌ సాలే సినిమాలోని ‘కూత ర్యాంప్‌..’ అనే లిరికల్‌ వీడియో పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్‌ యూత్‌ని ఆకట్టకుంటున్నాయి.

Updated : 07 Dec 2022 19:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సంగీత దర్శకుడు కీరవాణి తనయుడిగా చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీసింహా కోడూరి (Sri Simha). ‘మత్తు వదలరా’, ‘తెల్లవారితే గురువారం’ చిత్రాల తర్వాత ఈ యంగ్‌ హీరో నటిస్తున్న చిత్రం ‘భాగ్‌ సాలే’ (Bhaag Saale). ప్రణీత్‌ సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమాలోని ‘కూత రాంప్‌..’ అనే లిరికల్‌ వీడియో పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్‌ యూత్‌ని ఆకట్టకుంటున్నాయి. థ్రిల్లింగ్‌ క్రైమ్‌ కామెడీ కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ సింహా సరసన నేహా సోలంకి (Neha Solanki) నటిస్తుండగా రాజీవ్‌ కనకాల, జాన్‌ విజయ్‌, వర్షిణి సౌందరాజన్‌, నందిని రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం యూత్‌ను హోరెత్తిస్తున్న ఆ పాటను మీరు చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని