Unstoppable 2: త్రివిక్రమ్ అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడొస్తున్నావ్.. ఎవరితో రావాలో తెలుసుగా: బాలకృష్ణ

‘అన్‌స్టాపబుల్‌  -2’ సరికొత్త ప్రోమో విడుదలైంది. బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో విశ్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొని సందడి చేశారు.

Updated : 16 Oct 2022 12:04 IST

హైదరాబాద్‌: నటుడు బాలకృష్ణ (Bala krishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable 2). ఇటీవల ప్రారంభమైన ఈ టాక్‌ షో సెకండ్‌ సీజన్‌ ప్రస్తుతం సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో తాజాగా టాలీవుడ్‌ యువ నటులు విశ్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ సందడి చేశారు. సిద్ధు లుక్‌ చూసిన బాలయ్య.. ‘‘మేకప్ మేన్‌, హెయిర్‌స్టైలిష్ట్‌.. ఎవరయ్యా సిద్ధు బాబు తల దువ్వకుండా పంపించారు’’ అంటూనే.. తాను మెస్సీ లుక్‌లో కనిపించిన సినిమాలన్నీ ఫ్లాప్‌ అయ్యాయని సరదాగా చెప్పారు. ఇదే ఎపిసోడ్‌లో నిర్మాత నాగవంశీ కనిపించి.. తమ బ్యానర్‌ నుంచి త్రివిక్రమ్‌ బయటకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పారు. అనంతరం బాలయ్య.. దర్శకుడు త్రివిక్రమ్‌కు ఫోన్‌ చేసి.. ‘‘అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావ్‌?’’ అని ప్రశ్నించారు. ‘‘మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను‌’’ అని డైరెక్టర్‌ చెప్పగానే.. ‘‘ఎవరితో రావాలో తెలుసుగా’’ అని బాలయ్య అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని