Ravanasura: ‘రావణాసుర’ సందడి

రవితేజ (raviteja) కథానాయకుడిగా... సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అను ఇమ్మానుయేల్‌, మేఘ ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు.

Updated : 02 Mar 2023 07:11 IST

రవితేజ (RaviTeja) కథానాయకుడిగా... సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). అను ఇమ్మానుయేల్‌, మేఘ ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. అభిషేక్‌ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి సందర్భంగా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నెల  6న టీజర్‌ని విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. సుధీర్‌ వర్మ మార్క్‌ కథనంతో, ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. రవితేజ ట్రెండీగా కనిపిస్తారు. అత్యుత్తమ నిర్మాణ విలువలు సినిమాకి ప్రధాన బలం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనతో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యాయి. ఈ వేసవిలో వస్తున్న అత్యంత ఆకర్షణీయ చిత్రాల్లో ఇదొకట’’ని సినీ వర్గాలు తెలిపాయి. రావురమేష్‌, మురళీశర్మ, సంపత్‌ రాజ్‌, నితిన్‌ మెహతా, సత్య, జయప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం!: విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని