Nithiin: కలెక్టర్ మీద చెయ్యేస్తే గవర్నమెంట్ మీద చెయ్యి వేసినట్టే!

‘నువ్వేమో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లా పంచ్‌లు.. వీళ్లేమో బోయపాటి శ్రీనులా యాక్షన్‌ సీన్‌లు.. ఇప్పుడు నేనేం చేయాలి. రాజమౌళి హీరోలా ఎలివేషన్‌ ఇవ్వాలా’

Published : 30 Jul 2022 19:58 IST

హైదరాబాద్‌: ‘నువ్వేమో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లా పంచ్‌లు.. వీళ్లేమో బోయపాటి శ్రీనులా యాక్షన్‌ సీన్‌లు.. ఇప్పుడు నేనేం చేయాలి. రాజమౌళి హీరోలా ఎలివేషన్‌ ఇవ్వాలా’ అంటున్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా రాజశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం ట్రైలర్‌ విడుదల చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, యాక్షన్‌ను మేళవించి సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని