
MaheshBabu: ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నా.. : మహేశ్‌బాబు
హైదరాబాద్: అభిమానులను కలవడం, వాళ్లతో కాసేపు సరదాగా మాట్లాడటం తనకెంతో ఇష్టమని.. సుమారు రెండేళ్ల నుంచి ఆ మధురానుభూతిని మిస్ అవుతున్నానని ఇటీవల సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. ‘సర్కారువారి పాట’ రిలీజ్‌ని దృష్టిలో పెట్టుకుని తాజాగా ఆయన అభిమానులతో ముచ్చటించారు. సోషల్‌మీడియా వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వీడియో షేర్ చేశారు. ఆ విశేషాలు మీకోసం...
‘సర్కారువారి పాట’లో మీకు నచ్చిన విషయం?
మహేశ్: హీరో పాత్రను సృష్టించిన విధానం నాకెంతో నచ్చింది. మీక్కూడా నచ్చుతుంది.
మనీహెయిస్ట్ సిరీస్‌లో మీకిష్టమైన పాత్ర ఏమిటి?
మహేశ్: ప్రొఫెసర్.
మీ నుంచి ఏదైనా సూపర్‌హీరో మూవీ కోరుకోవచ్చా?
మహేశ్: నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు.
మార్వెల్ లేదా డీసీ.. దేన్ని ఎంచుకుంటారు?
మహేశ్: మార్వెల్
భవిష్యత్తులో సితారని వెండితెరపై నటిగా చేసే అవకాశం ఉందా?
మహేశ్: నాకు తెలిసి తను ఇప్పటికే నటి అయిపోయింది.
మీరెప్పుడూ అంత ప్రశాంతంగా ఎలా ఉండగలరు?
మహేశ్: ఎందుకుంటే నేను ప్రశాంతంగా ఉండే వ్యక్తిని కాబట్టి. (నవ్వులు)
షూటింగ్లో ఉన్నప్పుడు పరశురామ్లో మీరు గుర్తించిన విశేషం ఏమిటి?
మహేశ్: ఆయన రైటింగ్ అద్భుతంగా ఉంటుంది.
ఒక రోజులో ఎంత సమయం ఫోన్‌కి కేటాయిస్తారు?
మహేశ్: చాలా చాలా తక్కువ
మీ వృత్తి మార్చుకోవాల్సి వస్తే.. ఎవరి వృత్తిని ఎంచుకుంటారు? ఎందుకు?
మహేశ్: నో.. నేను ఎప్పటికీ మహేశ్‌బాబు ది యాక్టర్‌గానే ఉండటానికి ఇష్టపడతా.
మీకిష్టమైన ఫుట్‌బాల్ ప్లేయర్?
మహేశ్: రొనాల్డో
మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
మహేశ్: నా భార్య నమ్రత
మీ కుటుంబంలో స్మార్ట్ పర్సన్ ఎవరు?
మహేశ్: సితార
మీరు ఎప్పుడైనా వేలం పాటలో పాల్గొన్నారా?
మహేశ్: లేదు
సర్కారువారి పాటలో మీకు ఇష్టమైన డైలాగ్?
మహేశ్: మెయిన్‌టెయిన్ చేయలేక దూల తీరిపోతుందయ్యా
మీరు వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా చూస్తారని విన్నా. ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన వెబ్ సిరీస్?
మహేశ్: ప్రస్తుతానికి బ్రేక్ తీసుకున్నా.
నమ్రతలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి?
మహేశ్: ఆమెలో అన్నీ ఇష్టమే అందుకే పెళ్లి చేసుకున్నా
బిజీ షెడ్యూల్స్‌లోనూ మీ పిల్లలకు సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు?
మహేశ్: ఎలా అంటే చెప్పలేను కానీ, పిల్లలతో మాత్రం తప్పకుండా సమయాన్ని గడుపుతా.
సర్కారువారి పాటలో మీకిష్టమైన స్టిల్
మహేశ్: ఫస్ట్ పోస్టర్.
మిమ్మల్ని ప్రేరేపితం చేసిన సరికొత్త చిత్రం?
మహేశ్: ‘ఆర్ఆర్ఆర్’ నాకెంతో నచ్చింది. అద్భుతమైన చిత్రం.
ఈ సినిమాలో మీకిష్టమైన పాట?
మహేశ్: కళావతి
మీరు వీడియో గేమ్స్ ఆడతారా?
మహేశ్: ఆడేవాడిని. ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నా.
మీక్కూడా చీట్ డే ఉందా?
మహేశ్: సండే.. ఎప్పటికీ అదొక చీట్ డేనే
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
India News
Kerala: సీఎం పినరయ్ విజయన్ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
-
Movies News
Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- బిగించారు..ముగిస్తారా..?
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- Narendra Modi: డబుల్ ఇంజిన్ వస్తోంది
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి