Rakul Preet Singh: ప్రియుడి బర్త్‌డే వేడుకల్లో రకుల్‌.. నా బెస్ట్‌ గిఫ్ట్‌ అంటూ పోస్ట్‌

బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ జన్మదిన వేడుకల్లో హిందీ తారలతోపాటు టాలీవుడ్‌ నటులూ సందడి చేశారు. తన ప్రియుడు గురించి రకుల్‌ ప్రత్యేకంగా ఓ పోస్ట్‌ పెట్టారు.

Published : 27 Dec 2022 01:11 IST

ముంబయి: తన ప్రియుడు, నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ పుట్టినరోజు వేడుకల్లో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) సందడి చేశారు. ముంబయిలోని భగ్నానీ నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో బాలీవుడ్‌ సెలబ్రిటీలు కార్తిక్‌ ఆర్యన్‌, వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌, షాహిద్‌ కపూర్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, టాలీవుడ్‌ తారలు ప్రజ్ఞా జైస్వాల్‌, మంచు లక్ష్మి పాల్గొన్నారు. జాకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి.. గేమ్స్‌, డ్యాన్స్‌లు చేస్తూ సరదాగా ఎంజాయ్‌ చేశారు. ఈ పార్టీలో దిగిన పలు ఫొటోలను మంచు లక్ష్మి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తన ప్రియుడి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనతో దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు రకుల్‌. ‘‘నా జీవితానికి దొరికిన ఉత్తమమైన బహుమతి నువ్వే. హ్యాపీ బర్త్‌డే మై లవ్‌. నా జీవితంలో సంతోషం, శాంతిని నింపుతున్నందుకు ధన్యవాదాలు. నీ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని రకుల్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జాకీ.. ‘‘ఈ మొత్తం ప్రపంచంలో నన్ను ఎప్పుడూ సంతోషపెట్టే వ్యక్తివి నువ్వే ’’ అని అన్నారు. బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోన్న రకుల్‌ ఎన్నో ఏళ్ల నుంచి జాకీతో రిలేషన్‌లో ఉన్నారు. సుమారు రెండేళ్ల క్రితం వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని