Manchu Vishnu: మంచు విష్ణుకు స్వల్ప గాయాలు..?

‘కన్నప్ప’ సినిమా సెట్‌లో మంచు విష్ణుకు గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్‌లో జరుగుతోన్న షెడ్యూల్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Published : 29 Oct 2023 18:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన తదుపరి చిత్రం ‘కన్నప్ప’ (Kannappa) షూట్‌లో నటుడు మంచు విష్ణు (Manchu Vishnu)కు గాయాలైనట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌లో జరుగుతోన్న షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా డ్రోన్ కెమెరా అదుపు తప్పి విష్ణు మీదకి దూసుకురావడంతో చేతికి స్వల్ప గాయాలయ్యానని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి షూట్‌ నిలిపి వేశారని సమాచారం. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Siddharth Aditi: ఏం జరుగుతోంది?.. సిద్ధార్థ్‌, అదితి ఫొటోపై దర్శకుడి కామెంట్‌

విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సిద్ధమవుతోంది. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు. ‘కన్నప్ప’ చిత్రం మొత్తాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే దీనికోసం తయారు చేయించిన ఆర్ట్‌ వర్క్‌ మొత్తాన్ని అక్కడకు తరలించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా మొదట నుపుర్‌ సనన్‌ను ఎంపిక చేశారు. డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగారు. ప్రభాస్‌, నయనతార, శివరాజ్‌కుమార్‌, మోహల్‌ లాల్‌ తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని