Manchu vishnu: కన్నప్ప గురించి ఆ ప్రశ్న నన్ను డిస్టర్బ్‌ చేసింది: మంచు విష్ణు

‘కన్నప్ప’ను ప్రేక్షకులకు చూపించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) తెలిపారు.

Published : 19 Jan 2024 02:03 IST

హైదరాబాద్‌: మహాకవి ధూర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా చేసుకుని మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఆయన కలల ప్రాజెక్ట్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తాజాగా ఆయన చెప్పారు.

‘‘సంక్రాంతి రోజున ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా #AskMeAnything నిర్వహించాను. తమిళనాడు, కర్ణాటకతోపాటు ఉత్తరాదికి చెందిన చాలామంది నెటిజన్లు అడిగిన ఓ ప్రశ్న నన్ను కాస్త ఇబ్బందికి గురిచేసింది. ‘మీ మైథలాజికల్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రిలీజ్‌ ఎప్పుడు?’ అన్నది వాళ్ల ప్రశ్న. మైథలాజికల్‌ అంటే హిస్టారికల్‌గా ప్రూఫ్‌ లేనిది. ఒక విధంగా చెప్పాలంటే కల్పితం అని అర్థం. ఎక్కడో నాసాలో ఉన్నవాళ్లు ‘రామ్‌సేతు’ ఆనవాళ్లు ఉన్నాయంటే.. నిజమేనని మనం నమ్ముతాం. దాని గురించి చర్చిస్తాం. మన సంస్కృతి, సంప్రదాయాలను మనం ఎందుకు నమ్మడం లేదు? చరిత్ర గురించి తెలుసుకోవడమే కాదు.. దాన్ని నమ్మాలి. దానిపట్ల గర్వపడాలి. ‘కన్నప్ప’ నిజమైన కథ అని చెప్పడానికి నిదర్శనం శ్రీ కాళహస్తీశ్వర ఆలయం. అక్కడి దేవాలయంలో ఉన్న వాయులింగం. ఇది మైథలాజికల్‌ మూవీ కాదు. ఇది నిజంగా జరిగిన కథ. శివ భక్తుడైన కన్నప్ప కథే ఈ సినిమా’’ అని మంచు విష్ణు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని