Manisha Koirala: ఆ సినిమా భారీ వైఫల్యంతో నా కెరీర్ ముగిసిపోయింది: మనీషా
21 ఏళ్ల క్రితం విడుదలైన ఓ సినిమా పరాజయం వల్ల దక్షిణాదిలో తన కెరీర్ ముగిసిపోయిందని నటి మనీషా కొయిరాలా (Manisha Koirala) తెలిపారు. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని.. కాకపోతే అవన్నీ కలలుగానే మిగిలిపోయాయని ఆమె చెప్పారు.
ముంబయి: ‘బొంబాయి’ (Bombay)తో దక్షిణాది సినీ ప్రియులకు చేరువైన నటి మనీషా కొయిరాలా (Manisha Koirala). ఆ సినిమా విజయం తర్వాత పలు కోలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ‘బాబా’ (BABA) తర్వాత తమిళ చిత్ర పరిశ్రమకు దూరమైన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన ఆ సినిమాపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని.. సినిమా వైఫల్యంతో దక్షిణాదిలో తన కెరీర్ ముగిసిపోయిందని చెప్పారు.
ముందే అనుకున్నా..!
‘‘తమిళంలో నేను చేసిన ఆఖరి పెద్ద సినిమా ‘బాబా’ (BABA). ఆ రోజుల్లో అది భారీ వైఫల్యాన్ని చవిచూసింది. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. తీరా చూస్తే సినిమా ఫ్లాప్. దాంతో దక్షిణాదిలో నా కెరీర్ ముగిసిపోయిందని భావించాను. చివరికి అదే జరిగింది. ‘బాబా’ కంటే ముందు అక్కడ నేను కొన్ని మంచి చిత్రాల్లో నటించా.. పేరు తెచ్చుకున్నా. కానీ ‘బాబా’ తర్వాత నాకు ఎలాంటి ఆఫర్స్ రాలేదు. ఇక ఎలాంటి ప్రచారం లేకుండా ఇటీవల ఆ చిత్రాన్ని రీ రిలీజ్ చేసినప్పడు మంచి విజయాన్ని అందుకుంది. అది చూసి నేను ఆశ్చర్యపోయా. రజనీకాంత్‌తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపించింది’’ అని మనీషా వివరించారు.
వెర్రిదాన్ని అని తిట్టారు..!
అనంతరం ఆమె ‘బొంబాయి’ రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘మొదట్లో ‘బొంబాయి’ సినిమా చేయకూడదనుకున్నా. కెరీర్ ఆరంభంలోనే తల్లి పాత్రలు చేయవద్దని ఎంతోమంది నన్ను హెచ్చరించారు. కానీ, సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా మాత్రం నన్ను తిట్టారు. ‘మణిరత్నం సినిమాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? ఆయన సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నావంటే నిజంగానే నువ్వొక వెర్రిదానివి’ అని ఆయన కేకలు వేశారు. ఆ మాటలు నన్నెంతో కదిలించాయి. వెంటనే అమ్మతో కలిసి చెన్నైకు వెళ్లి సినిమాలో భాగమయ్యా. ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ ఆనందిస్తున్నా’’ అని (Manisha Koirala) పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: తెదేపా ఓ కుటుంబం.. కార్యర్తలు మా బిడ్డలు: భువనేశ్వరి
-
King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!
-
Demat accounts: ఊరిస్తున్న మార్కెట్లు.. పెరిగిన డీమ్యాట్ ఖాతాలు
-
Rathod Bapu Rao: భారాసకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా: రాథోడ్ బాపూరావు
-
Lokesh: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్బంధం..: లోకేశ్
-
Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక మాజీ క్రికెటర్‌కు బెయిల్